![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -99 లో... రాజ్, కావ్యలు షాపింగ్ అయిపోయి బయటకు వస్తారు. అప్పుడే రాహుల్ ని స్వప్న ఎదురుచేస్తుంది. అప్పుడే రాహుల్ వచ్చి స్వప్న దగ్గరికి వచ్చి.. రాజ్ స్వప్నని చూస్తే వెళ్లి నిజం చెప్తుందని తనని తీసుకొని వేరే దగ్గరికి వస్తాడు రాహుల్.
మరొకవైపు సోఫాలో కూర్చున్న అపర్ణ, ఇందిరాదేవి దగ్గరికి రుద్రాణి వచ్చి.. ఈ ఇంటి కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని చెప్పడంతో.. అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మి... వెళ్లకుంటే ఏం చేస్తుంది.. అడుగడుగునా అవమానిస్తుంటే ఆ అమ్మాయయినా ఎలా ఉండగలదని ధాన్య లక్ష్మి అనగానే.. ఏంటి నీకేమైంది.. నిన్నటి నుండి అలాగే మాట్లాడుతున్నావని అపర్ణ అంటుంది. తోడి కోడళ్ళకి గొడవ పెట్టానని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాణి.
మరొకవైపు షాపింగ్ అయిపోయి రాజ్, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వస్తారు. మీకు ఆకలిగా ఉన్నట్లుంది వడ్డించనా అని కావ్య అంటుంది. అప్పుడే డిజైన్ పట్టుకొని రాజ్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ డిజైన్ చూసి రాజ్ ఆమెపై కోప్పడతాడు. అయితే అది గమనించిన కావ్య.. ఒకసారి నాకు ఇవ్వండి నేను చూస్తానని కావ్య తీసుకుంటుండగా.. రాజ్ లాక్కుని నీకు అవసరం లేని విషయమని కావ్యతో చెప్పి.. ఆ అమ్మాయిని పంపిచేస్తాడు.
కావ్య టిఫిన్ వడ్డీస్తూ ఉండగా.. అప్పుడే సుభాష్, ప్రకాష్ లు వస్తారు. నువ్వేంటమ్మా ఇక్కడ అని కావ్యని సుభాష్ అడుగుతాడు.రాజ్ కి భోజనం తీసుకువచ్చిందని ప్రకాష్ అంటాడు.. రాజ్ మీటింగ్ ఉందని అమగానే.. వచ్చాక తినొచ్చని వెళ్తారు. రాజ్ కోప్పడిన అమ్మాయి దగ్గరికి కావ్య వచ్చి.. ఏమైంది ఇంకా డిజైన్ కాలేదా అంటూ అడుగుతుంది. లేదని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. కావ్య ఆ డిజైన్ తీసుకొని సరిచేస్తుంది.. ఈ డిజైన్ నేను చేంజ్ చేసినట్లు మీ సర్ తో చెప్పకని అంటుంది కావ్య.. మరొకవైపు రాహుల్, స్వప్న కలిసి మాట్లాడుకుంటారు.
అంతా అయిపోయింది.. మన పెళ్లి ఇక జరగదు.. నువ్వు చేసిన పనికి ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో మన విషయం తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేస్తానంటున్నారని రాహుల్ స్వప్న పై విరుచుకుపడుతాడు.. నేనేం చేశాను.. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని స్వప్న అంటుంది. దీనంతటికి కారణం మీ చెల్లి.. ఇంట్లో అందరి దృష్టిలో నిన్ను బ్యాడ్ చేసిందని స్వప్నకి లేనిపోనివి కల్పించి చెప్తాడు రాహుల్..
మరొకవైపు కావ్య తెచ్చిన టిఫిన్ ని రాజ్, సుభాష్, ప్రకాష్ కలిసి తింటారు. టిఫిన్ బాగుందంటూ మెచ్చుకుంటారు కానీ రాజ్ మాత్రం బాలేదన్నట్లు చూస్తాడు. అప్పుడే కావ్య సరిచేసిన డిజైన్ పట్టుకొని ఆ అమ్మాయి వస్తుంది. రాజ్ చూసి ఆ డిజైన్ బాగుందని చెప్తాడు.. మరొకవైపు రాహుల్, స్వప్నని ఎలా వదిలించుకోవాలని కావ్యపై చెడుగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |